TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీమ బిడ్డ మాట్లాడే తీరు ఇదేనా?

Published on: Mon Jan 2, 2012 9:16AM

హైదరాబాద్: తెలంగాణ విషయంలో  కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సీమాంధ్ర నేతలు విరుచుకుపడ్డారు. సీమాంధ్ర ద్రోహి, నాన్న ఆశయాలు తుంగలో తొక్కాడని, పరకాలలో కొండా సురేఖపై టిఆర్ఎస్ పోటీ చేయకూడదనే ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేశారని, వైఎస్ కడుపున చెడ పుట్టావని, మీ నాన్న సమైక్యాంధ్ర వాది అయితే, 2009 ఎన్నికలప్పుడు ఆయన ప్రచారం చేస్తూ తెలంగాణ వస్తే సీమాంద్రులు హైదరాబాద్ వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారని, అలాంటి తండ్రి కడుపున పుట్టి పిరికిపందలా వ్యవహరిస్తున్నావని, రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్‌తో కుమ్మక్కై నీ తండ్రి ఆశయాలను తుంగలో తొక్కావని, నువ్వు సీమాంధ్ర ద్రోహివని, సమైక్యాంధ్ర వ్యతిరేకివని, సీమాంధ్రలో ఓటు అడిగే నైతిక హక్కు నీకు లేదని, అసలు సీమ బిడ్డ మాట్లాడే తీరు ఇదేనా? అని సీమాంధ్ర నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కెసిఆర్‌తో జగన్ కుమ్మక్కై వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కాడని, నాటి ఎన్నికలప్పుడు నంద్యాల సభలో వైఎస్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే వీసా అవసరం ఉండకూడదంటే ప్రజా తీర్పు స్పష్టంగా ఉండాలని కోరారని, ఆ విషయం జగన్‌కు గుర్తులేదా? అని వీర శివా రెడ్డి ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో పరకాల నుంచి కొండా సురేఖ విజయం కోసమే తెలంగాణలో జగన్ పోటీ వద్దనుకుంటున్నారన్నారన్నారు. ఈ నిర్ణయంతో జగన్ పిరికితనం బయటపడిందన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంతానికి జగన్ ద్రోహం చేశారని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. వైఎస్ సమైక్యవాది, ఆయన కొడుకైన జగనేమో రాయలసీమ, ఆంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పాదాల వద్ద వాల్చాడని, జగన్ ఆంధ్రా ప్రాంత ద్రోహి అని, పదవి కోసం కెసిఆర్‌తో లాలూచీ పడ్డాడని, దీంతో వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని ఆనం వివేకానంద రెడ్డి విమర్శించారు. నాడు పార్లమెంట్‌లో సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని జగన్ నినాదాలు చేశారని గుర్తు చేశారు. అలాంటి జగన్ ఇప్పుడేమో తెలంగాణలో తమ పార్టీ పోటీ చేయదని చెబుతున్నారంటే ఇది మడమ తిప్పడం కాక మరేమిటని ప్రశ్నించారు. తెలంగాణలో ఓదార్పు పర్యటన కోసమే జగన్ ఇలా ప్రకటించారని పేర్కొన్నారు.