TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆజాద్..రాక..వారిరువురితో చర్చలు

Published on: Mon Jan 2, 2012 8:17AM

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ ఈ వారాంతంలో హైదరాబాదు కు వచ్చినప్పుడు వారిద్దరితోనూ చర్చలు జరిపి, విభేదాలను రూపుమాపడానికి ప్రయత్నిస్తారని అంటున్నారు. ఆజాద్ మతపరమైన సమావేశానికి హాజరయ్యేందుకు ఈనెల 5న హైదరాబాదుకు వస్తున్నారు. అవసరమైన పక్షంలో ఆయన ఒక రోజు అక్కడే ఉండి, ముఖ్యమంత్రి, బొత్సా మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని ఎఐసిసి వర్గాలు చెబుతున్నాయి. వీరి విభేదాల మూలంగా పార్టీకి నష్టం జరుగుతోందని రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు అధినాయకత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇరువురి మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించకపోతే ముందుముందు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని వారు కాంగ్రెస్ అధినాయకులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మూలంగా కాంగ్రెస్‌కు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పుట్టగతులు లేకుండాపోయాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి వైఖరి మరింత కుంగదీస్తున్నాయని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే వీరి మధ్య సయోధ్యకు ప్రయత్నాలను ఆరంభించనుంది.