31మద్యం షాపుల్లో వాటాలు ఎలా?బొత్స కు బాబు ప్రశ్న
Published on: Fri Dec 30, 2011 1:30PM
హైద
రాబాద్: మద్యం పాలసీ ప్రకారం ఒక వ్యక్తికి ఒకే దుకాణం ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్టీఆర్ భవవంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. అలాంటప్పుడు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకు 31 మద్యం షాపుల్లో వాటాలున్నాయని ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. మద్యపానం విషయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కిరణ్ ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల జరిగిన దాడుల్లో బయటపడిన ఎసిబి రికార్డులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో మద్యపానాన్ని నియంత్రిస్తే ఇప్పుడు వారు దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకు వచ్చారని ఆరోపించారు. మద్యం విషయంలో సాక్ష్యాత్తూ యువజన కాంగ్రెసు నాయకుడే లేఖ రాశారన్నారు. మద్యం విషయంలో ప్రభుత్వం చర్యలకు నిరసనగా జనవరి 3, 4, 5 తేదీల్లో నియోజకవర్గాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. లోక్‌పాల్ విషయంలో కాంగ్రెసు పార్టీ రాజ్యసభలో దాదాపు పారిపోయినంత పని చేసిందని బాబు ఎద్దేవా చేశారు. లోక్‌పాల్ విషయంలో కేంద్రానికి తాను కూడా లేఖ రాశానన్నారు. ఉగ్రవాదం కంటే అవినీతే ప్రమాదమైందన్నారు. ఎంపీలను కొనుగోలు చేసి మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే కాంగ్రెసు ప్రజల పట్ల బాధ్యతను మరిచి పోతుందన్నారు.


