TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రముఖ రచయిత త్రిపురనేని ఇకలేరు

Published on: Fri Dec 23, 2011 11:26AM

హైదరాబాద్: ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి ఇవాళ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. మహారథి ఎన్నో హిట్ సినిమాలకు మాటలు రాశారు. బందిపోటు చిత్రంతో రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. నిలువుదోపిడి, పెత్తందారులు, కంచుకోట, దేశోద్ధారకులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, ప్రజారాజ్యం సినిమాలకు సంభాషణలు రాశారు. త్రిలింగ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. కృష్ణ నటించిన శాంతి సందేశం చిత్రానికి ఆయన చివరిగా మాటలు రాశారు. మహారథికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.