ఆ భయంలో సీఎం అందుకే చిరుకు పదవినో
Published on: Thu Dec 22, 2011 1:58PM
హై
దరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ అన్నారు. ఒకవేళ చిరంజీవికి కేంద్రమంత్రి పదవి లభిస్తే తిరుపతిలో జరిగే ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదన్న భయం సీఎం కిరణ్ కుమార్‌ను వెంటాడుతోందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని చెవిరెడ్డి జోస్యం చెప్పారు. ఇక చిరంజీవికి తుడా ఛైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన సిగ్గుచేటు అని చెవిరెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పూతలపట్టు ఎమ్మెల్యే రవి అవిశ్వాస తీర్మానం సమయంలో సభకు గైర్హాజరు వెనక కిరణ్ కుమార్ హస్తమున్నట్లు ఆరోపించారు.


