సార్వత్రిక సమ్మెకు ఐఎన్‌టీయూసీ పిలుపు
Published on: Wed Dec 21, 2011 4:01PM
హైద
రాబాద్ : కార్మికుల సమస్యలపై ఈనెల 28న దేశవ్యాప్తంగా ఒక్క రోజు సార్వత్రిక సమ్మెకు ఇండియన్ నేషనల ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమ్మెలో 12 కార్మిక సంఘాలు పాల్గొంటాయని యూనియన్ నేతలు తెలిపారు. అధిక ధరలు, పెట్రోలు, డీజీల్ ధరల పెంపు, కార్మిక చట్టాల అమలు వంటి డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నట్టు వారు చెప్పారు. ఐఎన్‌టీయూసీ పేరిట కొంత మంది నాయకులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారని, వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ డీజీపీని కలువనున్నట్టు వారు తెలిపారు.


