తనపై చర్యలు తీసుకోమనే హక్కు చిరుకు లేదు శోభ
Published on: Mon Dec 19, 2011 8:05AM
హైద
రాబాద్: తనపై అనర్హత వేటు వేయమని కోరే నైతిక హక్కు చిరంజీవికి లేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభానాగి రెడ్డి అన్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ఎప్పుడో ప్రకటించారని అలాంటప్పుడు తనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరే హక్కు చిరంజీవికి గానీ, వంగా గీతకు గానీ లేదన్నారు. చిరు మద్దతుతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సి రావడం కాంగ్రెసుకు సిగ్గు చేటు అన్నారు. తనపై వేటు వేయాలని నిర్ణయం తీసుకుంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు. కాగా ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకాశం జిల్లాలో అన్నారు. వైయస్ సంక్షేమ పథకాలు నీరుగార్చిన ప్రభుత్వంపై నిత్యం పోరాటం చేస్తామన్నారు.


