కౌశిక్ రెడ్డిని తరిమికొట్టిన ఓటర్లు.. హుజురాబాద్ లో హై టెన్షన్..
Published on: Sat Oct 30, 2021 10:27AM
తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రచారాలు చేస్తున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నారు.
వీణవంక మండలం ఘన్ముక్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థి కాకపోయినప్పటికీ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అది గమనించిన బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నావ్ అంటూ కౌశిక్‌ను నిలదీశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించారు.


