TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హుజురాబాద్ లో ఆశలు వదులుకున్న టీఆర్ఎస్! మూడు రౌండ్లలోనూ బీజేపీకి లీడ్... 

Published on: Tue Nov 2, 2021 10:47AM

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం పెరుగుతోంది. తొలి రౌండ్ లో 116, రెండో రౌండ్ లో 192 ఓట్ల లీడ్ సాధించిన ఈటల రాజేందర్ కు మూడో రౌండ్ లో 911 పరుగుల భారీ ఆధిక్యత వచ్చింది. దీంతో మూడు రౌండ్లు ముగిసేసరికి ఈటల మెజార్టీ 12 వందల 69కి పెరిగింది. హుజురాబాద్ రూరల్ కౌంటింగ్ ముగియగా.. టౌన్ లెక్కింపు జరుగుతోంది. తాజా ట్రెండ్స్ ను బట్టి హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది.

హుజురాబాద్ మండలంలో తమకు లీడ్ వస్తుందని పోలింగ్ తర్వాత గులాబీ నేతలు  ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లోనూ హుజురాబాద్ మండలంలో గట్టిపోటీ ఉందని తేలింది. అయితే ప్రస్తుతం మాత్రం హుజురాబాద్ లో మంచి మెజార్టీ దిశగానే ఈటల రాజేందర్ దూసుకుపోతున్నారు. వీణవంక, ఇల్లంతకుండ, కమలాపూర్ మండలాల్లో బీజేపీకి మంచి లీడ్ రావచ్చని భావిస్తున్నారు. దీంతో హుజురాబాద్ పై టీఆర్ఎస్ ఆశలు వదులుకుందని తెలుస్తోంది. 

హుజారాబాద్ మూడో రౌండ్

టీఆర్ఎస్     2680
బీజేపీ           3727
బీజేపీ  లీడ్  911 బీజేపీ
బీజేపీ మొత్తం లీడ్  1269 ఓట్లు 

హుజురాబాద్ రెండో రౌండ్

టీఆర్ఎస్     4659 
బీజేపీ           4851
కాంగ్రెస్        220 
రెండో రౌండ్ లీడ్  192  బీజేపీ
మొత్తం లీడ్  358  బీజేపీ 

హుజురాబాద్ తొలి రౌండ్

మొత్తం ఓట్లు   9894 
టీఆర్ఎస్  4444
బీజేపీ      4610
కాంగ్రెస్  119
తొలి రౌండ్ లీడ్  116 బీజేపీ