భార్యకి జీతం గురించి చెప్పి తీరాల్సిందే!

 

మీకు నెలనెలా ఎంత జీతం వస్తోందో రహస్యంగా ఉంచుతున్నారా. మీ భార్యకి లెక్కలు తెలిస్తే, కొత్త ఖర్చులు చేయిస్తుందని భయపడుతున్నారా! ఇలాంటి లేనిపోని జాగ్రత్తలు పడితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇది సాక్షాత్తు కోర్టువారు చేస్తున్న హెచ్చరిక. మధ్యప్రదేశ్‌లో దాఖలైన ఓ వ్యాజ్యం సంద్భంగా ‘భర్త జీతం గురించి తెలుసుకునే హక్కు భార్యకి’ ఉందని అక్కడి హైకోర్టు స్పష్టం చేసింది. ఐదారు అంకెల జీతాన్ని అనుభవిస్తున్నా భార్యకి కేవలం ఏడు వేల రూపాయల భరణాన్ని ఇస్తున్న కేసులో కోర్టు ఈ వ్యాఖ్యానం చేసింది. భర్త జీతం ఎంతో తెలుసుకుని, దానికి అనుగుణంగా భరణాన్ని కోరే హక్కు ఉందని తెలియచేసింది.