టీ ఇవ్వడం ఆలస్యమైందని భార్యనే...
Published on: Fri Aug 22, 2014 12:55PM
.jpg)
ఆమె పేరు ఝునా. ఆమె చేసిన నేరం ఏమీ లేదు.. మహలి నాయక్ అనే తన భర్త టీ ఇవ్వమంటే టీ కాస్తోంది. అయితే ఆ భర్త మాత్రం ఆమె తనకు టీ కావాలనే ఆలస్యంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని భావించాడు. దాంతో భార్యతో వాగ్వాదానికి దిగాడు. మొదట్లో శాంతంగానే సమాధానం చెప్పిన ఆమెలో ఒక దశ తర్వాత సహనం చచ్చిపోయి భర్తకి ఎదురుతిరిగి మాట్లాడింది. అంతే అతనిలోని రాక్షసుడు నిద్రలేశాడు. భార్యని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన ఒడిశాలో భువనేశ్వర్కు 110 కిలోమీటర్ల దూరంలోని దెన్కనల్ జిల్లా గుహలిపుల్ గ్రామంలో జరిగింది.


