Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భర్త ప్రతి రాత్రి ఇంటర్నెట్ లో ఈ పని చేస్తున్నాడా...భార్యలు అలెర్ట్ కావాల్సిందే!
posted on: Apr 10, 2024 11:12AM
స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్‌లు అనే ఈ రెండు జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సంబంధ స్వభావం మారిపోయింది. మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్న మనుషుల మీద కాకుండా మొబైల్ ఫోన్‌లలో బిజీగా ఉండటానికే ఇష్టపడతారు చాలామంది. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటివి జరిగితే వారి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఇది ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది. అయితే భర్త ఇంటర్నెట్ లో ఏ విషయాలు సెర్చ్ చేస్తున్నాడు? అనే విషయం మీద భార్యలు ఎంత అలెర్ట్ గా ఉండాలనే విషయం ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలామంది మగవాళ్లు రాత్రి పూట మొబైల్ లో ఆడవాళ్ల ప్రోఫైల్ లు, వారి ఫొటోలు చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇంతకీ ఈ అలవాటు ఎందుకంత మంచిది కాదు.. ఈ అలవాటును భార్యలు ఎలా ఎదుర్కోవాలి? తెలుసుకుంటే..
ఇతర మహిళల ప్రోఫైల్ లు..
చాలామంది భర్తలు రాత్రి సమయంలో భార్య పనులు చేసుకుంటున్నప్పుడో, భార్య పడుకున్న తర్వాతో ఇంటర్నెట్ లో ఇతర మహిళల ప్రొఫైల్ లు సెర్చ్ చేసి, వారి ఫొటోలు చూస్తుంటారు. సాధారణంగా కొంతమంది మహిళలు ఫేవరెట్ హీరోయిన్ లేదా సెలెబ్రిటీ ఫొటోస్ చూస్తున్నాడు ఏం అవుతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఇది అక్కడితో ఆగకుండా ఇతర మహిళల వరకు వెళితే మాత్రం ఆడవాళ్లు అలెర్ట్ కావాల్సిందే. దీని కారణంగా భర్తలు భార్యలను బాడీ షేమింగ్ చేయడం, ఇతర మహిళల అందంతో భార్యలను పోల్చడం వంటి ఎన్నింటికో దారితీస్తుంది.
అభ్యంతరం..
భర్తలు ఇలా ఇతర మహిళల ప్రొఫైల్స్ సెర్చ్ చేస్తుంటే.. భార్యలు ఆభ్యంతరం చెప్పాలి. నా భర్త పరాయి మహిళల ఫొటోలు చూస్తున్నాడు అని మనసులో ఫీలవ్వడం కంటే నేరుగా భర్తతో అలా చూడద్దని చెప్పడం మంచిది. అలా చెప్పిన తరువాత వారు అదే పని కంటిన్యూ చేస్తుంటే సింపుల్ వారితో మాట్లాడటం తగ్గిస్తే సరి.. వారు నెట్ లో ఇతర మహిళల ఫొటోలు చూడాలని అనుకున్నప్పుడల్లా తాము తప్పు పని చేస్తున్నామేమో అనే ఫీలింగ్ వారికే కలుగుతుంది. క్రమంగా ఆ అలవాటు కూడా తగ్గుతుంది.
తప్పు ఎక్కడుందంటే..
చాలా వరకు మగాళ్లు ఇతర మహిళల పట్ల, ఇతర మహిళల ఫ్రొఫైల్స్, ఫోటోస్ చూడటం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారంటే దానికి పెద్ద కారణం వారికి భార్య నుండి అసంతృప్తి ఎదురవుతున్నట్టు. చాలా వరకు భార్యలు ఇంటి పని, ఉద్యోగాల కారణంగా తమ పట్ల తాము చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మహిళలు తమ పట్ల తాము కేర్ గా ఉంటూ, అందంగా ముస్తాబవుతుంటే భర్త కూడా ఇతర మహిళల వైపు కన్నెత్తి చూడడు. కాబట్టి భర్తలను మార్చుకునే మార్గం భార్యల చేతుల్లోనే ఉంది.
*నిశ్శబ్ద.



.webp)


