ప్రేమ పెళ్లి చేసుకున్న భార్యను...దారుణంగా హత్య చేసిన భర్త

posted on: Feb 24, 2026 1:57PM

 

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేని జీవితం లేదంటూ సినిమా డైలాగులు చెప్పి యువతిని బుట్టలో పడేసాడు. చివరకు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య మీద అనుమానం మొదలైంది. దీంతో ప్రతినిత్యం యువతికి చుక్కలు చూపించాడు. అనుమానం మితిమీరిపోవడంతో ఏకంగా భార్యను పరలోకానికి పంపించాడు.. తన భార్య కనిపించడం లేదంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ బంధువులను స్నేహితులను నమ్మించాడు కానీ పాపం పోలీసులను నమ్మించలేకపోయాడు. దీంతో సదరు వ్యక్తి శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకు న్నాడు. ఈ విషాదకరమైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.


రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి పరిధిలో నివాసముంటున్న నాగరాజు మందుల వ్యాపారం చేస్తున్నాడు ఇతను కృష్ణ అనే వ్యక్తికి చెందిన ఫార్మసీలో పనిచేస్తున్నాడు. అయితే అక్కడ పనిచేసే సమయంలో నాగరాజుకు రాజేశ్వరి అనే యువతితో పరిచయం ఏర్పడింది.. నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని రాజేశ్వరిని నమ్మించాడు. అతని మాటలు నిజమైన నమ్మిన రాజేశ్వరి, నాగరాజు ప్రేమలో పడింది... కొంతకాలం క్రితం ఈ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకు న్నారు.. అయితే పెళ్లి తర్వాత దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇదే సమయంలో రాజేశ్వరి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని నాగరాజు అనుమానం పెంచుకొని ఇంట్లో గొడవ పడేవాడు.. 

నాగరాజుకు రోజురోజుకీ భార్యపై అనుమానం పెరిగిపోవడంతో ఎలాగైనా సరే భార్యను తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణకు తన ప్లాన్ మొత్తం చెప్పాడు. పథకం ప్రకారమే భార్యను హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఎవరు తనను అనుమానించకుండా ఉండేందుకు నా భార్య కనిపించడం లేదంటూ నాగరాజే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో నాగరాజు తన స్నేహితుడైన కృష్ణ సహాయంతో భార్య రాజేశ్వరిని హత్య చేసి అనంతరం శవాన్ని పలు ముక్కలుగా నరికి డంప్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించసాగాయి.

 అంతేకాకుండా నాగరాజు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతనిపై అనుమానం కలగడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది... దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు... అసలు రాజేశ్వరిని ఎలా హత్య చేశాడు? మృతదేహం ఏం చేశాడు? ఇతనికి ఎవరు సహకరించారు? హత్యకు దారి తీసిన పూర్తి వివరాలు కుట్రలో పాల్గొన్న వారి పాత్ర పై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగించారు ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య చోటుచేసుకున్న విషాదాంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది..


 

google-ad-img
    Related Sigment News
    • Loading...