Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోతూ పోతూ కుక్కనీ తీసుకెళ్లారు
posted on: Apr 3, 2015 1:37PM

తాము చనిపోతే తమ పెంపుడు కుక్కని ఎవరు చూసుకుంటారని తాము చనిపోయే ముందు పాపం దానిని కూడా చంపేశారు. ఈ ఘటన ప్రకాశంజిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం ప్రవీణ్ కుమార్, భార్య కనకరత్నం, కూతురు శ్రుతి కొత్తపేటలో ఉంటున్నారు. అయితే ఓ కేసు విచారణలో భాగంగా ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో భర్త అరెస్ట్ కావడంతో మనస్తాపానికి గురైన కనకరత్నం, కూతురు శ్రుతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు పెంచుకున్న కుక్కకి కూడా ఉరేశారు.






