TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ మునిసిపోల్స్.. హంగ్ ఏర్పడిన మునిసిపాలిటీలివే..!

Published on: Sat Feb 14, 2026 10:18AM

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు  వెలువడ్డాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, ఏడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలో జిల్లాల వారీగా హంగ్ ఏర్పడిన మునిసిపాలిటీల వివరాలిలా ఉన్నాయి.  
 
మెదక్ జిల్లాలో  మెదక్, నర్సాపూర్ మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. అలాగే,  కరీంనగర్ జిల్లాలో వేములవాడ, మెట్ పల్లి, రాయికల్ , కోరుట్ల, జమ్మికుంట మునిసిపాలిటీలలో హంగ్ ఏర్పడింది. ఇక నల్లొండ జిల్లాలో పోచంపల్లి మునిసిపాలిటీ, అలాగే,  మహబూబ్ నగర్ జిల్లాలో  గద్వాల, అలంపూర్, నారాయణపేట, అమరచింత మునిసిపాలిటీలు,  ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్,  భైంసా, ఖానాపూర్ మునిసిపాలిటీలలోనూ హంగ్ ఏర్పడింది. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి,  వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, జనగాం, మహబూబాబాద్, కేసముద్రం మునిసిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో ఎల్లంపేట మునిసిపాలిటీలోనూ హంగ్ ఏర్పడింది.