తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ దొంగ దొరికాడు
Published on: Fri Sep 12, 2025 9:28AM

తిరుమల శ్రీవారికి భక్తులు భక్తితో హుండీలో సమర్పించే కానుకలను దొంగిలిస్తూ ఓ దొంగ పట్టుబడ్డాడు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని బంగారు బావి పక్కన ఉన్న స్టీల్ హుండీ నుంచి నగదు చోరీ చేసిన దొంగను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదును చోరీ చేశాడు.
నాలుగువేల రూపాయలను సదరు దొంగ హుండీ నుంచి చోరీ చేయడాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని సీసీటీవీలో గమనించిన అధికారులు వెంటనే విజిలెన్స్, భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని పట్టుకుని అతడిని పోలీసులకు అప్పగించారు.


