TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తల.. నల్గొండ జిల్లాలో నరబలి కలకలం

Published on: Mon Jan 10, 2022 9:29AM

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నరబలి కలకలం రేగింది.  శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం దగ్గర మొండెం నుండి వేరు చేసిన తలను అమ్మవారి పాదాల దగ్గర దిమ్మెపై వదలి వెళ్లారు దుండగులు.చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామం విరాట్ నగర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తల కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నరబలి ఇచ్చి మొండెం నుంచి తలను వేరు చేసి మొండాన్ని తీసుకుపోయి తలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు.

ఆలయం వద్ద తలను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులను ఆరా తీశారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత ఆలయానికి వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు. ఈ వార్త దావానలంలా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. నిన్న  ఆదివారం కావడంతో క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చారేమోనన్న వదంతులతో స్థానికుల్లో భయాందోళన కనిపిస్తోంది. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్-నాగార్జున సాగర్ స్టేట్ హైవేపై ఈ గ్రామం ఉంది. శ్రీ మెట్టు మహంకాళి దేవాలయం హైవే రోడ్డుకు ఆనుకునే ఉంటుంది. ఆ వ్యక్తిని వేరే చోట హత్య చేసి.. తలను మాత్రం విగ్రహం దగ్గర పెట్టి దుండగులు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొండేన్ని మరోచోట వదిలి ఉండొచ్చని భావిస్తున్నారు.