TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డోజ్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనల వెల్లువ

Published on: Mon Mar 3, 2025 1:37PM

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ఒక్కో సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా ట్రంప్ పట్ల వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ట్రంప్ సంక్షేమ పథకాలను కుదిస్తూ ఏర్పాటు చేసిన డోజ్ పై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వ్యక్తమౌతోంది.

ప్రభుత్వ సమర్దత పేరిట సంక్షేమ పథకాలకు నిధులలో కొత విధిస్తూ ట్రంప్, ఆయన దోస్త్ టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలో ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే డోజ్ కు వ్యతిరేకంగా ఆందళన కారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఏర్పాటైన డోజ్ వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా టెస్లా కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.  టెస్లా కొనుగోళ్లు, విస్తరణను అడ్డుకోవాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. ఒక్క అమెరికాలోనే కాకుండా టెస్లాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టెక్సాస్, ఆరిజోనా,  సెయింట్‌ లూయిస్‌, న్యూయార్క్‌, డేటన్‌, ఒహియోబీ షార్లెట్‌, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో డోజ్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.  
 
ఎలాన్‌ మస్క్‌, ట్రంప్‌ విధానాలకు నిరసనగా కొందరు టెస్లా కార్ల యజమానులు తమ వాహనాలను ధ్వంసం చేశారు.   యుఎస్‌ఏజన్సీఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సహా ప్రభుత్వ విభాగాలను మూసివేశారు. ఈ చర్యలు అమెరికా బడ్జెట్‌ను నియంత్రించడానికి మాత్రమే దోహదపడుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.