TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హెరాయిన్ క‌ల‌క‌లం.. 280కోట్ల డ్ర‌గ్స్ సీజ్‌..

Published on: Mon Apr 25, 2022 12:25PM

ఉగ్ర‌వాదంతో పాటు డ్ర‌గ్స్‌తోనూ భార‌త్‌ను దెబ్బ తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది పాపిస్తాన్‌. పాక్ ప్రేరేపిత టెర్ర‌రిస్టుల‌ను భార‌త సైన్యం పిట్ట‌ల్లా కాల్చిప‌డేస్తుంటే దాయాది దేశానికి మైండ్ బ్లాంక్ అవుతోంది. తుపాకుల‌తో ప‌ని కాద‌నుకుందో ఏమో.. డ్ర‌గ్స్‌తో మ‌న‌ల్ని దెబ్బ‌కొట్టాల‌ని స్కెచ్ వేస్తోంది. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున మ‌త్తు ప‌దార్థాల‌ను భార‌త్‌లోకి అక్ర‌మంగా డంప్ చేస్తోంది. గ‌తంలో గుజ‌రాత్‌లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టం.. అక్క‌డ డొంక‌ లాగితే.. ఆ లింకులు ఏపీకి, వైసీపీ నేత‌ల‌కు చుట్టుకోవ‌డం అప్ప‌ట్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. లేటెస్ట్‌గా మ‌రోసారి గుజ‌రాత్ తీరంలో పెద్ద మొత్తంలో హెరాయిన్ చిక్క‌డంతో ఏపీ మ‌రోసారి ఉలిక్కిప‌డింది. అయితే ఈసారి ఆ పాపం.. పాకిస్తాన్‌ద‌ని తేలింది.

గుజరాత్‌ తీరంలో మరోసారి భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం రేపింది. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తోన్న వందల కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ ఫిషింగ్‌ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకొన్నారు. రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. ఆ పడవలోని తొమ్మిది మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. 

అరేబియా సముద్రం మీదుగా హెరాయిన్‌ స్మగ్లింగ్‌ జరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌, గుజ‌రాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌-ఏటీఎస్‌ సంయుక్తంగా ఆదివారం రాత్రి స్పెష‌ల్‌ ఆపరేషన్ చేప‌ట్టింది. భారత్‌ వైపు వస్తున్న పాకిస్థాన్‌ పడవ ‘అల్‌ హజ్‌’ను అడ్డుకున్నారు. తనిఖీలు నిర్వహించగా.. భారీ ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకుని.. డ్ర‌గ్స్‌ను ఎక్క‌డికి స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌నే దానిపై ఆరా తీస్తున్నారు.