శాటిలైట్ అమ్మకాల్లో రికార్డు సృష్టించిన 'అగ్నిపథ్’
Published on: Sun Dec 25, 2011 11:47AM
ముం
బై: హృతిక్‌రోషన్ తాజా చిత్రం ‘అగ్నిపథ్’ శాటిలైట్ హక్కుల అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు రూ. 41 కోట్లకు జీ టీవీ దక్కించుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ‘క్రిష్ 3’, ‘రా.వన్’ చిత్రాలను వెనక్కు నెట్టి ఈ చిత్రం అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ‘క్రిష్3’ శాటిలైట్ హక్కులు రూ.37 కోట్లకు అమ్ముడయ్యాయి. హృతిక్‌రోషన్, ప్రియాంక చోప్రా, సంజయ్‌దత్ ప్రధాన పాత్రలు పోషించిన ‘అగ్నిపథ్’ వచ్చే ఏడాది 26న విడుదలకు సిద్ధమవుతోంది.


