TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్యేవే కాలేదు,  సీఎం ఎలా అవుతావు?...  రోజా 

Published on: Mon Sep 19, 2022 4:52PM

తెర‌మీద న‌ట‌న‌కు వేలాదిమంది వీరాభిమానులు త‌యారుకాగానే రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోగ‌ల నాయ కుడు అవుతారా  సినీస్టార్లు?  సామాన్య జ‌నానికి  ఇదో తీర‌ని  సందేహం. సినిమాలు వ‌దిలేసుకుని జ‌నం కోసం పాటుప‌డ‌తానంటూ ప‌వ‌ర్‌స్టార్ రాజ‌కీయ‌రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత పెద్ద‌గా సాధించిందేమీ లేద ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీద వైసీపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉంది. తాజాగా వైసీపీ మంత్రి ఆర్.కె.రోజా ప‌వ‌ర్ స్టార్‌పై విరుచుకుప‌డ్డారు. వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. ఇది  విని రాష్ట్రంలోని ప్రజలు నవ్వుకుంటున్నార‌ని . జగన్ సీఎం కాలేవు అన్నావు.. నువ్వు ఎమ్మెల్యేవి కాలేక పోయా వ‌ని. చిన్న పిల్లలు నీ మీటింగ్‌కు వస్తే సీఎం అయిపోతాన‌ని ఎలా అనుకున్నావ‌ని రోజా ఎద్దేవా చేశారు. 

టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పాద‌యాత్ర‌ను ర‌ద్దు చేసుకున్నార‌ని మీరూ పాదయాత్ర‌ను ర‌ద్దు చేసుకోవ‌డమేమిట‌ని రోజా ప్ర‌శ్నించారు. అస‌లు ప్ర‌జారాజ్యం పార్టీకి రాష్ట్రంలో 175 సీట్ల‌కు పోటీ చేయడానికి అంత‌మంది అభ్య‌ర్ధులు లేర‌ని వైసీపీ మంత్రి రోజా అన్నారు. 

వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. ఇది విని రాష్ట్రంలోని ప్రజలు నవ్వుకుం టున్నార‌ని అన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్‌టీ ఆర్ పార్టీ పెట్టీ అధికారంలోకి సింగిల్‌గా వచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సింగిల్‌గా పోటీ చేశారు. జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో భోజనం చేసి హక్కులు రాష్ట్రం వదులుకున్నా రని అంటున్నారు.. బీజేపీ, టీడీపీలు ఉమ్మడి రాజ ధానిగా హైదరాబాద్‌ను వదిలి వచ్చినప్పుడు నువ్వు షూటింగ్‌లో ఉన్నావా? అని ప్ర‌శ్నించారు.

నీకు దమ్ముంటే 175 సీట్లలో నీ అభ్యర్ధులను పెట్టి జగన్‌తో ఢీకొను. పందులే గుంపుగా వస్తాయి. ఈ రోజు లోకేష్ ఒక బుర్ర తక్కువ పని చేస్తున్నాడు. లోకేష్‌కు కేవలం అధికార దాహం. అందుకే ఎంఎల్‌సీ, మంత్రి అయ్యాడు. పొద్దున్నే ఎద్దుల బండి ఎక్కి వస్తుంటే చూసిన వాళ్లు నవ్వుకుంటున్నా రన్నారు. 

లక్ష 23 వేల కోట్ల ఈ ప్రభుత్వం రైతులకు మూడున్నర ఏళ్లలో అందించింది. నువ్వు అసెంబ్లీ పై జన సేన జెండా ఎగురవేస్తా అన్నావు. నువ్వు అసెంబ్లీలోనే అడుగుపెట్టాకుండా చేశామ‌ని పేర్కొన్నారు