TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీని ఎంఐఎం గెలిపించిందా?.. యూపీ ఓట్లు లెక్కతో క్లారిటీ!

Published on: Mon Mar 14, 2022 2:39PM

బీజేపీ, ఎంఐఎం ఈ రెండు పార్టీలు రాజకీయ కక్షకు వేర్వేరు దృవాలు. ఒకటి ఉత్తర దృవం అయితే ఇంకొకటి దక్షిణ దృవం. అయితే, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి, రెండు దృవాలు, కలవకుండానే కలిసి ఒకటయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన రహస్య ఒప్పదం వల్లనే, సమాజ్ వాదీ, ఆర్‌ఎల్‌డీ కూటమి చతికిల పడింది. వందకు పైగా స్థానాల్లో ఎంఐఎం పోటీచేసి, బీజేపీని గెలిపించింది.ఇది నమ్మసఖ్యంగా లేక పోయినా నిజం, అని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓటును ఎంఐఎం చీల్చడం వల్లనే  బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిందని అంటున్నారు.  

యూపీ ఎన్నికల్లో, బీజేపీ200 ఓట్లతో 7 సీట్లు, 500 ఓట్లతో 23 సీట్లు, 1000 ఓట్లతో 49 సీట్లు, 2000 ఓట్ల తేడాతో 86 సీట్లు గెలుచుకుంది. అంటే 165 నియోజక వర్గాల్లో, 200 నుంచి 2000 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ అన్ని నియోజక వర్గాలలో ఎంఐఎం పార్టీ, బీజేపీ విక్టరీ మార్జిన్ కంటే ఎక్కువ ఓట్లను పట్టుకు పోయిందని, ఆ విధంగా బీజేపీ బీ’ టీమ్’ ఎంఐఎం సహకారంతో రెండవసారి అధిక్రంలోకి వచ్చిందని, రాజకీయ విశ్లేషకులు, నియోజక వర్గాల వారీగా ఓట్ల వివరాల ఆధారంగా, వివరిస్తున్నారు.  

ఉదాహరణకు, బిజ్నోర్‌లో ఎస్పీ - ఆర్‌ఎల్‌డీ కూటమికి 95,720 ఓట్లు పోలయ్యాయి,  ఎంఐఎంకు 2,290 ఓట్లు వచ్చాయి. ఈ నియోజక వర్గంలో, బీజేపీ అభ్యర్ధి, కేవలం 1,445 ఓట్ల అధిక్యతతో విజయం సాధించారు. అంటే ఎంఐఎం పోటీలో లేకుంటే, పార్టీకి పోలైన 2,290 ఓట్లు ఎస్పీ - ఆర్‌ఎల్‌డీ కూటమి ఖాతాలో చేరితే, బీజేపే అభ్యర్ధి  ఓడిపోయి,కూటమి అభ్యర్ధి గెలిచేవారని విశ్లేషకులు భావిస్తున్నారు. 
అలాగే, నకూర్‌లో బీజేపీకి 1,03,771 ఓట్లు రాగా, ఎస్పీకి 1,03,616 ఓట్లు వచ్చాయి. ఏఐఎంఐఎంకు 3,591 ఓట్లు రావడంతో బీజేపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే విధంగా, బారాబంకిలోని కుర్సీ స్థానంలో బీజేపీకి 1,18,614 ఓట్లు రాగా, ఎస్పీకి 1,18,094, ఏఐఎంఐఎంకు 8,541 ఓట్లు వచ్చాయి, ఫలితం చెప్పా నక్కర లేదు. సుల్తాన్‌పూర్‌లో బీజేపీ, ఎస్పీల మధ్య ఉన్న వ్యత్యాసం (92,245- 90,857) 1388. ఇక్కడ ఎంఐఎంకి  5,251 ఓట్లు పోలయ్యాయి. అదే విధంగా, బీజేపీ 1647 ఓట్ల అధిక్యతతో విజయం సాధించిన  ఔరాయ్ అసెంబ్లీ స్థానంలో ఎంఐఎం 2,190 ఓట్లను చేజిక్కించుకుంది. 

షాగంజ్‌లోనూ 76,035 ఓట్లు సాధించిన బీజేపీ విజయం సాధించింది. కానీ, ఈనియోజక వర్గంలో ఎస్పీకి 70,370 ఓట్లు పోలైతే, ఏఐఎంఐఎం 7,070 ఓట్లను చేజిక్కించుకుంది. అంటే, ఎస్పీ, ఎంఐఎంకు పోలిన ఓట్లు(70440), ఒకే ఖాతాలో చేరితే, గెలిచిన బీజేపే అభ్యర్ధి కంటే, 1405 ఓట్ల అధిక్యతతో విజయం సాధించేదని విశ్లేషకులు అంటున్నారు. ఇలా ఇంకా అనేక నియోజక వర్గాల్లో ఎంఐఎం అభ్యర్ధులు ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం, రహస్య మిత్ర పక్షం బీజేపీని గెలిపించిందని, బీజీపీ వ్యతిరేక ముస్లిం ఓట్లను చీల్చి  బీజేపీని గెలిపించాలనే కచ్చితమైన లక్ష్యంతో ఏఐఎంఐఎం యూపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.