బాత్‌రూంలో రే*ప్.. చేసింది ఎవరంటే..?
Published on: Thu Oct 14, 2021 12:50PM
అనగనగా ఓ ఇల్లు. యజమానితో పాటు మరికొందరు ఆ ఇంట్లో అద్దెకు ఉంటారు. ఓ గదిలో ఇద్దరు కుర్రాళ్లు రెంట్‌కు ఉన్నారు. కొన్నాళ్లూ మంచిగానే ఉన్నారు. మంచోళ్లే కదా అనుకున్నారు. కానీ, వాళ్లు మనుషులు కాదు మానవ మృగాలని ఆ తర్వాత తెలిసింది. అద్దెకున్న వాళ్లు రేపిస్టులుగా మారారు. యజమాని కుటుంబంలో కల్లోలం రేపారు. ఇంతకీ ఏం జరిగిందంటే....
ఢిల్లీలో ఓ యువతిని బాత్‌రూంలో బంధించి ఇద్దరు యువకులు అత్యా-చారానికి తెగబడ్డారు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా.. వెనకనుండి వచ్చి.. బాత్‌రూంలో బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడటం కలకలం రేపింది. సొంత ఇంట్లోనే రక్షణ లేకపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరినీ నమ్మే పరిస్థితి లేదని వాపోతున్నారు.
ఇంటి యజమాని కూతురిని రే*ప్ చేసిన నిందితులిద్దరూ ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఘటన అనంతరం యువతిని వారిద్దరూ బెదిరించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
జరిగిన దారుణాన్ని బాధితురాలు ఇంట్లో వారికి చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరిలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారం మేరకు మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


