TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో హోటళ్ల మూత.. టీటీడీ అన్నప్రసాదానికి పెరిగిన భక్తుల తాకిడి

Published on: Thu Mar 26, 2026 9:59AM

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. తిరుమలేశుని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో తిరుమల నిత్యం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. అటువంటి తిరుమలపై ఇప్పుడు గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా పడింది.

గ్యాస్ సిలిండర్లు అందక  తిరుమలపై దాదాపు 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో భక్తులంతా  తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత అన్నప్రసాదంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో  అన్నదాన సత్రంపై ఒత్తిడి అధికమంది. గత నెలతో పోలిస్తే ఈ నెల ఇప్పటి వరకూ దాదాపు లక్షన్నర మందికి పైగా అదనంగా అన్నప్రసాదం స్వీకరించారు.

 రోజుకు సుమారు 6 టన్నుల గ్యాస్ను వాడుతున్నా, హోటళ్ల మూసివేతతో అన్నదాన సత్రాలపై ఒత్తిడి గణనీయంగా పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. భక్తులందరికీ అన్నప్రసాదం అందించడం టీటీడీకి కష్టసాధ్యమౌతుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.