TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రేమ ప్రేమే.. మ‌నిష‌యినా , హార్న్‌బిల్ పక్షి అయినా!!

Published on: Wed Jun 22, 2022 6:19AM

బాబూ అమ్మాయికి నొప్పులు మొద‌ల‌య్యాయి ఆస్ప‌త్రిలో చేర్చాం అని మొబైల్ స‌మాచారం అంద‌గానే స‌ద‌రు అల్లుడు అత్త‌గారి వూరెళ్లాడు.  త‌ర్వాత ఆస్ప‌త్రికి వెళ్లాడు. బిడ్డ పుట్టేవ‌ర‌కూ ఆస్ప‌త్రిలో కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే వున్నాడు, టెన్ష‌న్‌తో! ఇది  దాదాపు  99 శాతం అంద‌రూ చూసిన‌, తెలుసుకున్నసంగ‌తే! 

అయితే మ‌నుషుల్లోనే కాదు ప‌క్షుల్లోనూ ఇంత‌టి ప్రేమ వుంటుంద‌ని హార్న్‌బిల్ తెలియ‌జేసింది.  అయితే  ఆ అబ్బా యి ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్‌, న‌ర్సుల మాట కోసం ఆప‌రేష‌న్ థియేట‌ర్ ద‌గ్గ‌ర గోళ్లు  తినేస్తూ వుండవ‌చ్చు.  
కానీ ఈ హార్న్‌బిల్ మాత్రం త‌న జీవిత‌భాగ‌స్వామికి కావ‌ల‌సిన తిండిని బ‌య‌టి నుంచి అం దిస్తో  గంట‌లు  కాదు ఏకంగా రెండు మూడు నెల‌ల కాలం అలా స‌హ‌క‌రిస్తూ  గ‌డిపింది. అట‌వీశాఖ అధికారి కాస్వాన్ ఆ హ‌ర్న్‌బిల్ ప్రేమ‌నంతా వీడియో తీసి మ‌న‌కు అందించారు. 

ఒక  చెట్టు తొర్ర లో ఆడ హార్న్‌బిల్ పిల్ల‌ల్ని పొదుగుతుండ‌గా ఆ చెట్టు మీద తొర్ర ద‌గ్గ‌ర‌గా కూచుని మ‌గ హార్న్‌బిల్ దానికి తిండి అందిస్తుంది. ఇది  ఒక్క రోజు కాదు కొన్ని నెల‌లుగా సాగుతోందిట‌. ఈ జంట‌ను కాస్వాన్  అత్యుత్త‌మ జంట అని పిలుస్తున్నారు. 
ఈ ప‌క్షులు చాలాకాలం బ‌తుకుతాయిట‌. వీటిలో ఆడ‌ప‌క్షి పిల్ల‌లు క‌నే స‌మ‌యా నికి త‌గిన ఇంటికోసం మ‌గ ప‌క్షి అడ‌వంతా తిరుగుతూ ఒక సుర‌క్షితమైన చెట్టును ఎంచుకుంటుందిట‌.