TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హర్మూజ్ సంక్షోభం ఎండ్.. ఇండియాకు వస్తున్న నౌకలు!

Published on: Thu Jun 25, 2026 10:10AM

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన  హర్మూజ్ జలసంధిలో గత కొన్నినెలలుగా  నెలకొన్న  ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడింది. అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగించిన  హెర్మోజ్ సంక్షోభం, అమెరికా,  ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో ముగిసింది.  ఫలితంగా  హెర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ సంక్షోభానికి తెరపడటంతో..   భారతదేశానికి  పెద్ద ఊరట  . లభించిందనే చెప్పాలి. ఎందుకంటే..  దేశ ఇంధన అవసరాలకు కావలసిన ముడిచమురు,  ఎల్‌పీజీ, మరియు వ్యవసాయ రంగానికి ప్రాణాధారమైన ఎరువుల సరఫరా కోసం ఇండియా ప్రధానంగా హెర్మూజ్ జలసంధిపైనే ఆధారపడుతోంది.  

ఇప్పుడు హెర్మూజ్ జలసంధి  క్లియర్ కావడంతో..  భారత్‌కు వస్తున్న 30 నౌకలు  సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయని భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. వీటితో పాటు మరో 26 భారీ నౌకలు ప్రయాణ అనుమతి కోసం వేచి చూస్తున్నాయని పేర్కొంది.   ఇదే సమయంలో, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు భారీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఇప్పటికే సురక్షితంగా ప్రయాణించి తమిళనాడులోని ఎన్నూర్, అలాగే కేరళలోని కొచ్చి తీరాల్లో ఉన్న గ్యాస్ టెర్మినల్స్‌కు  చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా సాఫీగా సాగుతుండటంతో..  దేశంలో ముడిచమురు ధరలు స్థిరపడతాయనీ.. ఎరువుల కొరత పూర్తిగా తీరి వ్యవసాయ రంగానికి   మేలు జరుగుతుందని ఆర్థిక, రవాణా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.