TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనంతలో హనీ ట్రాప్ కలకలం.. లక్షల రూపా యలుదోచుకున్న ముఠా.. పోలీసులపై ఆరోపణలు

Published on: Thu Apr 23, 2026 10:05AM

 

అనంతపురంలో హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. మహిళలను ఎరగా వేసి ప్రముఖులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకుం టున్న ముఠా వ్యవహారం బయటపడింది. ఈ ఘటనలో పోలీసు శాఖకు చెందిన కొందరి పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత సంచలనం సృష్టించింది. పని ఉందంటూ మహిళలను పంపించి, బాధితులను ఏకాంత ప్రదేశాలకు రప్పించి మాట్లాడుతున్న సమయంలో ముఠా సభ్యులు అకస్మాత్తుగా దాడి చేసి... డబ్బులు డిమాండ్ చేస్తారు.

అనంతరం డబ్బులు ఇవ్వ కపోతే రేప్ కేసులు పెడతామని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.ఈ ముఠా ఇప్పటికే పలువురిని ఇలా బెదరించి లక్షలు వసూలు చేసినట్లు  సమాచారం. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.10 లక్షలు, ఓ జ్యోతిష్యుడి నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. బెదిరింపు లకు తట్టుకోలేక బాధితులు డబ్బులు ఇచ్చినట్లు చెబుతున్నారు.

అయితే ఈ హనీ ట్రాప్ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి సహకారం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టే బుల్ ప్రత్యక్షంగా ముఠాతో కలిసి పనిచేస్తున్నట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు ఇవ్వక పోతే పోలీసుల ద్వారా పంచాయితీ పెట్టిస్తామని బెదిరించారని బాధితులు ఆరోపిస్తున్నారు.బాధితులు ఈ ఘటనపై అనంతపురం ఎస్పీ జగదీష్ కు బాధితులు  ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో హనీ ట్రాప్‌కు సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అదలా ఉండగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు లేడీ డాన్ రంగమ్మ సహా మరో పది మందిని అదుపులోనికి తీసుకున్నారు. అలాగే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు సీఆర్ లను వీఆర్ కు పంపించారు.  మరి కొందరు పోలీసులపై కూడా చర్యలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.