TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంజాగుట్టలో ప్రభుత్వ ఉద్యోగిపై హనీ ట్రాప్

Published on: Mon May 18, 2026 1:04PM

హైదరాబాద్‌లో హనీట్రాప్ కేసు సంచలనం సృష్టించింది.     ఓప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి  పంజగుట్ట పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ హనీట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.   ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి గత మూడేళ్లుగా తనను ఓ  మహిళ  మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు.  సదరు మహిళ తొలుత  పరిచయం పెంచుకుని, తరువాత వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుంది. ఆ సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలను ఆధారంగా చేసుకుని అతడిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది.

ఇంతటితో ఆగకుండా, ఓయో రూముల బుకింగ్ స్లిప్పులు కూడా తన వద్ద ఉన్నాయని చూపిస్తూ మరింత ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేసింది... ఈ విధంగా గత మూడేళ్లుగా భయపెట్టి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నట్లు బాధిత అధికారి ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితుడు చివరకు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పంజాగుట్ట పోలీసులను ఆశ్రయిం చాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. మహిళ పాత్రపై, ఆమెకు మరెవరైనా సహక రించారా అనే కోణంలో కూడా విచారణ కొనసా గుతున్నారు.పోలీసులు సంబంధిత డిజిటల్ ఆధా రాలు, ఆర్థిక లావాదేవీలు, మరియు ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు