న్యాయవాదులకు హోమియోపతి మందుల పంపిణీ
Published on: Fri Jun 11, 2021 7:18PM
కరోనా మహమ్మారి కట్టడికి హోమియో మందు కూడా దోహదపడుతుందని నాంపల్లి క్రిమినల్ కోర్డు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. వేణుగోపాల్ అన్నారు. ప్రాణాంతకమైన ఈ వైరస్ నుంచి కాపాడుకోవటానికి ఈ హోమియోపతి మందు ఇమ్మ్యూనిటి బూస్టర్ డోస్ లా ఉపయోగపడుతుందని చెప్పారు. శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్డు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఉచిత హోమియోపతి మందులను ఆయన పంపిణీ చేశారు. ఆయా కోర్ఠుల పరిధిలోని పలువురు న్యాయవాదులు ఈ హోమియోపతి మందును తీసుకున్నారు.
హైదరాబాద్ కు చెందిన ఏటీఎం హోమియో స్టోర్స్ ఆధ్వర్యంలో ఈ హోమియో మందును తయారు చేశారు. సెవెన్ సీస్ ఎంటర్‌టైన్మెంట్ ఎండీ మారుతి శంకర్ లింగంనేని ఆధ్వర్యంలో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్డుకుచెందిన న్యాయవాదులకు కూడా ఈ మందును ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఏటీఎం హోమియో స్టోర్స్ సంయుక్త కార్యదర్శి జక్కుల లక్ష్మణ్ ను బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి. వేణుగోపాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, న్యాయవాది ఎ. విద్యాసాగర్, సుబ్బారావు ,చంద్రశేఖర్ ,నాగార్జున, శ్రీకాంత్ రాజేందర్ ,రూహి ,తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సోమవారం కూడా ఈ మందును నాంపల్లి కోర్టు లో మళ్ళీ పంచుతామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుషేకర్ చెప్పారు.


