TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు : హోం మంత్రి

Published on: Fri Jul 25, 2025 3:20PM

 

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచన నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. వర్షాలు, ష్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందుస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు హోం మంత్రి ఆదేశించారు. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆదేశించారు. 

రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రఖర్‌ జైన్‌, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ వైపు కదులుతుందన్నారు. ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు.. రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు. 

తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. వరద ముప్పు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హాట్‌స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి అని కలెక్టర్లకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ లో  112, 1070, 1800-4250101 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలను ఆమె కోరారు.