ఛానళ్ళ విషయంలో కేసీఆర్‌తో మాట్లాడతా: రాజ్‌నాథ్
Published on: Sat Sep 13, 2014 4:16PM
.png)
తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోగి ఛానళ్ళ ప్రసారాలను నిలిపివేసిన విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మరోసారి మాట్లాడనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇటీవల కేసీఆర్ తమతో భేటీ అయ్యారని, ఈ సందర్భంగా టీవీ చానెళ్లపై ఆయనతో చర్చించానన్నారు. ఇటీవల మీడియాను బెదిరిస్తూ కేసీఆర్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించడంపై కేంద్ర హోం మంత్రి స్పందిస్తూ దీనిపై కేసీఆర్‌తో మరోసారి మాట్లాడతానని చెప్పారు. తెలంగాణలో నిర్వహించిన సమగ్ర సర్వేపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో దానిపై కేంద్రం స్పందన ఏమిటని అడిగితే గణాంకాల కోసం సర్వే చేసి ఉండవచ్చునని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.


