నా కుమారుడిపై పుకార్లలో నిజం లేదు... రాజ్‌నాథ్
Published on: Wed Aug 27, 2014 2:58PM
.png)
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ అవినీతిపరుడని, చెడు ప్రవర్తన కలవాడని, అందువల్లే అతనికి గత ఎన్నికలలో నరేంద్రమోడీ టిక్కెట్ ఇవ్వలేదని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీటిని రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ పుకార్లను తాను ప్రధానమంత్రి దృష్టికి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళానని, వారిద్దరూ ఈ పుకార్లను విని ఆశ్చర్యపోయారని చెప్పారు. తన కుమారుడి మీద వస్తున్న పుకార్లు నిజమని తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా సిద్ధంగా వున్నానని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా, రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ మీద వస్తున్న పుకార్ల మీద ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఇవన్నీ గిట్టనివారు చేస్తున్న పుకార్లని, అవన్నీ అవాస్తవాలు, నిరాధారాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి జరుగుతున్న ప్రచారాలని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.


