నాయిని ఓపెన్ వార్నింగ్..
Published on: Fri Jan 15, 2016 11:38AM

రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ అధికారికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా కంటోన్మెంట్ పరిధిలోని కార్ఖానాలోని మూడో వార్డులో పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో నాయిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో సుజాతా గుప్తాకు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను బోర్డు సభ్యులను వేధించటం మానుకోవాలని.. జాగ్రత్తగా మసలుకోవాలని.. లేదంటే ఢిల్లీకి వెళ్లిపోవాలంటూ ఓపెన్ గా హెచ్చరించారు. దీంతో సుజాతా గుప్తాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరోవైపు నాయిని వార్నింగ్ పై పలువురు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాయిని వార్నింగ్ ఇవ్వాలంటే వ్యక్తిగతంగా ఇవ్వాలి లేకపోతే.. చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలే కానీ ఇలా అందరిముందు వార్నింగ్ ఇవ్వడం ఏంటంని అంటున్నారు.


