TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు

Published on: Wed Jul 13, 2022 3:58PM

తెలంగాణలో వర్షాకాల సెలవులు ఏకంగా 8 రోజులకు పెరిగాయి. వర్షాల కారణంగా తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది.

ఈ మేరకు ఈ నెల 14 నుంచి 16 వరకూ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం  నిర్ణయించింది.

దీంతో రాష్ట్రంలో విద్యాసంస్థలు ఈ నెల 18న పున: ప్రారంభం కానున్నాయి. దీంతో వర్షాల కారణంగా పాఠశాలలు వరుసగా ఎనిమిది రోజుల పాటు మూతపడినట్లైంది.

ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో ఈ నెల 16 వరకూ సెలవులు కాగా, 17వ తేదీ ఆదివారం దీంతో 18వ తేదీన తెరుచుకుంటాయి.