బూచాడు అనుకుని హిజ్రాని కొట్టి చంపేశారు

 

సోషల్‌ మీడియా పుణ్యమా అని పిల్లల్ని ఎత్తుకుపోయే బూచాళ్లు వస్తున్నారంటూ జనాలు బెదిరిపోతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరినీ చావబాదేస్తున్నారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఇలాంటి ఓ సంఘటనలో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. రమ్‌జాన్‌ సందర్భంగా దానాల స్వీకరించేందుకు ప్రయత్నిస్తున్న ఓ హిజ్రాని స్థానికులు బూచాడనుకుని భ్రమపడ్డారు. ఒకటీ రెండూ కాదు... దాదాపు వెయ్యిమంది ఆమె మీద దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హిజ్రా అక్కడికక్కడే మరణించాడు. బూచాడి భయం ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో చూడాలి!