పాక్ దుశ్చర్య.. హిందువుల బస్తీ నేలమట్టం

మైనార్టీల హక్కులను కాపాడటంలో పాకిస్థాన్ ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవల ఆ దేశ మానవ హక్కుల సంఘం తీవ్రంగా తప్పబట్టింది. అయినా పాకిస్థాన్ తీరు మారలేదు. మైనార్టీలైన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులపై  అరాచకాలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, హిందువులు నివాసం ఉంటున్న ఓ బస్తీ మొత్తాన్ని నేలమట్టం చేయించి, వారందర్నీ నిరాశ్రయులను చేసింది.

పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని భవల్‌పూర్‌లో హిందువులు నివసించే ఓ బస్తీని పాక్ ప్రభుత్వ అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. పాక్ గృహనిర్మాణ మంత్రి తారిఖ్ బషీర్, ఆ దేశ ప్రధాన సమాచార అధికారి సాహిద్ ఖోఖర్ పర్వవేక్షణలో అధికారులు ఈ కూల్చివేతలు చేపట్టారు. ప్రజల లబోదిబోమంటున్నా పట్టించుకోకుండా కర్కషంగా వ్యవహించారు. సొంత గూడు కోల్పోయిన హిందూ మైనారిటీ ప్రజలు.. మంటుటెండల్లో కట్టుబట్టలతో రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.