TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అల్లుడు హిందీ నేరుస్తున్నాడు!

Published on: Fri Aug 5, 2022 5:28PM

మ‌న పిల్ల‌లు మ‌న భాష మాట్లాడ‌టం కంటే ఇత‌ర ప్రాంతాల భాష‌లు మాట్లాడ‌టం ఆక‌ట్టుకుంటుంది. ఏద యినా కొత్త భాష నేర్చ‌కోవ‌డ‌మన్న‌ది చిన్న‌త‌నంలోనే అల‌వాటు కావాలి. పెద్ద‌య్యాక నేర్చుకోవ‌ డంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంత త్వ‌ర‌గానూ నేర్చుకోవ‌డం కుద‌ర‌దు. ఇటీవ‌లి కాలంలో విదేశీయులు మ‌న హిందీప‌ట్ల ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు. హిందీ, తెలుగు భాష‌ల మీద ప‌ట్టు సాధించ‌ డానికి ఎంతో కృషి చేస్తున్నార‌న్న‌ది మ‌న‌వాళ్ల ద్వారా తెలుస్తుంటుంది.  

అమెరికాలోనో, వేరే దేశంలోనో నివ‌సిస్తున్న మ‌నవాళ్ల పిల్ల‌లో, కోడ‌లో, అల్లుడో హ‌ఠాత్తుగా హిందీలో మాట్లా డ‌టం వింటే మీకు ఎలా ఉంటుంది?  మాట్లా డే తీరు, ప‌దాలు ప‌ల‌క‌డంలో వారి ఇబ్బంది తెగ న‌వ్వొస్తుం ది విన‌డానికి. కానీ  ప‌ట్టుద‌ల‌తోనే నేర్చేసు కుంటున్నారు. ఈమ‌ధ్య ఒకామె త‌న అమెరికన్  భ‌ర్త‌తో త‌ల్లి దండ్రుల‌కు వీడియో కాల్ చేసింది. ఇద్ద‌రూ మాట్లాడుతుండ‌గా హ‌ఠాత్తుగా అత‌ను హిందీలో మాట్లాడ‌టం మొద‌లెట్టాడు. అవ‌త‌ల‌వేపు వింటున్న అత్త మామ‌లు క‌డుపుబ్బ న‌వ్వుకున్నారు. 

స‌ద‌రు అల్లుడుగారు ప‌లికింది కేవ‌లం 20 ప‌దాలు. కానీ ప‌ది మాత్ర‌మే అందులో త‌ప్పులేకుండా చెప్పా డని, అయినా త్వ‌ర‌గానే నేర్చ‌కుని చెప్ప‌డం ప‌ట్ల నెటిజ‌న్లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అత‌గాడి అత్త‌ మామ‌లు, ఆ వీడియోని తిల‌కించిన బంధువ‌ర్గం మాత్రం ముద్దుగా హిందీ ప‌ల‌క‌డాన్ని ఎంతో మెచ్చు కున్నారు. అమ్మాయ్‌.. అబ్బాయికి ఆ మాత్రం వ‌స్తే చాల్లేవే.. మాట్లాడుతూంటే బావుంది! అని స‌ల‌హానూ ఇచ్చార‌ట‌. అల్లుడికి హిందీ బాగా రావ‌డం కంటే ప్ర‌స్తుతానికి అత‌ని హిందీ ప‌లుకు బాగా ఆక‌ట్టుకుంది. కానీ అత‌ని భార్య మాత్రం ఆటో, క్యాబ్  డ్రైవ‌ర్ల‌తో ఎలా మాట్లాడాల‌న్న‌ది నేర్చుకుంటు న్నాడ‌ని, త్వ‌ర‌లో ఇండియా వ‌స్తానంటున్నాడ‌ని అమ్మాయి వారి బంధువుల‌కు చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అన్న‌ట్టు అత‌నికి దాయే, బాయే, పానీపూరి, ఠీక్ హై.. అనేవి మాత్రం బాగా వ‌చ్చేశాయిట‌!