TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రిజర్వాయర్‌లో పడిన బస్సు 12 మంది మృతి

Published on: Wed Sep 24, 2014 12:42PM

 

హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన బస్సు క్రిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తూ గోవిందసాగర్ రిజర్వాయర్లో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరికొంతమంది ప్రయాణికులు నీటిలో మునిగిపోయారు. మునిగిపోయిన ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బతికి బయటపడిన ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉన్నారు. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనేది మాత్రం తెలియడం లేదు. ఈ బస్సు రిషికేశ్ నుంచి బిలాస్‌పూర్ వెళ్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులందరూ స్థానికులేనని తెలుస్తోంది.