TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హిమాచల్ ఎన్నికలు ప్రశాంతం

Published on: Mon Nov 5, 2012 11:21AM

Himachal elections, himachal poling, poling high, high range poling, record break, high percentage poling, Shimla lowest poling, churah highest poling, telugu news

 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రికార్డ్ స్ధాయిలో ఈ సారి 74.62 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68 స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మందకొడిగా మొదలైన పోలింగ్ రోజు గడిచినకొద్దీ ఊపందుకుంది. చాంబా జిల్లాలోని చురాహ్ నియోజకవర్గంలో అత్యథికంగా 78శాతం పోలింగ్ నమోదయ్యింది.

 

షిమ్లా నియోజకవర్గంలో అత్యల్పంగా 49శాతంమంది ఓటుహక్కుని వినియోగించుకున్నారు. కిన్నౌర్ లోని కా పోలింగ్ కేంద్రంలో 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న 18మంది ఓటర్లు తమ ఓటుహక్కుని వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.