TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెమీస్‌కి హిమా..రికార్డుల్లోకి సౌర‌వ్‌

Published on: Thu Aug 4, 2022 8:55PM

కామన్వెల్త్ గేమ్స్లో  భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. కామన్వెల్త్‌లో భారత్‌కు ఇప్పటి వరకు 18 పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి. బాక్సర్ అమిత్ పంఘల్  భారత్‌కు మరో పతకం ఖాయం చేశాడు. స్కాట్లాండ్ బాక్సర్ లెనన్ ములిగన్‌తో జరిగిన ఫ్లైవెయిట్ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధించిన అమిత్ సెమీస్‌లోకి వెళ్లి, కనీసం కాంస్య పతకం ఖాయం చేశాడు. అథ్లెటిక్స్‌లో హిమదాస్ 200 మీటర్ల సెమీస్‌లోకి ప్రవేశించింది.

హేమర్ త్రోలో మంజుబాల ఫైనల్‌లోకి ప్రవేశించింది. సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లలో షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించారు. స్క్వాష్‌ పురుషుల సింగిల్స్‌లో  

సౌరవ్‌ ఘోషల్‌ కాంస్యం సాధించి చరిత్ర సృష్టించాడు. సౌరవ్‌  3-0 (11-6, 11-1, 11-4)తో జేమ్స్‌ విల్‌స్ట్రాప్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించాడు. దీంతో ఈ క్రీడల్లో స్క్వాష్‌ సింగిల్స్‌లో కాంస్య పతకం గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా సౌరవ్‌ రికార్డులకెక్కాడు. స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జోష్న చిన్నప్ప-హరిందర్‌పాల్‌ సింగ్‌ సంధు జోడీ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్స్‌లో జోష్న జంట 8-11, 11-4, 11-3తో శ్రీలంక జంట‌ను ఓడించింది. అంతకుముందు మహిళల సింగిల్స్‌ ప్లేట్‌ ఫైనల్లో సునయన 11-7, 13-11, 11-2తో ఫంగ్‌ (గయానా)పై గెలిచింది.