TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడలో హిజాబ్ వివాదం.. లయోలా కాలేజ్‌లో ర‌చ్చ ర‌చ్చ‌..

Published on: Thu Feb 17, 2022 10:06AM

హిజాబ్‌..హిజాబ్‌..హిజాబ్‌. ఇప్పుడు దేశం మొత్తం హోరెత్తుతోంది ఈ వివాదం. క‌ర్ణాట‌క‌లో మొద‌లైన ఈ చిచ్చు.. హైకోర్టు ఆదేశాల‌తో కాస్త స‌ద్దుమ‌నిగింది. కానీ, ఆ ర‌చ్చ మిగ‌తా రాష్ట్రాల‌కూ పాకింది..పాకుతోంది. వివిధ రాష్ట్రాల్లోని ప‌లు కాలేజీల్లో ముస్లిం విద్యార్థినిలు కావాల‌నే హిజాబ్ ధ‌రిస్తున్న ఘ‌ట‌న‌లు పెరుగుతున్నాయి. మ‌రోవైపు, ఎప్ప‌టినుంచో హిజాబ్‌తో వ‌స్తున్న స్టూడెంట్స్‌ను.. యాజ‌మాన్యాలు కావాల‌నే ఆపుతున్న కేసులూ పెరుగుతున్నాయి. తాజాగా, ఆ హిజాబ్ ఇష్యూ విజ‌య‌వాడ‌కు వ్యాపించింది. ల‌యోలా కాలేజీలో చిచ్చు రాజుకుంది.

విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్‌ వివాదం తలెత్తింది. హిజాబ్‌ వేసుకొస్తే యాజమాన్యం రానివ్వట్లేదని పలువురు విద్యార్థినులు చెబుతున్నారు. ఐడీ కార్డులోనూ తాము హిజాబ్‌తోనే ఫొటో దిగామంటున్నారు. తాము ఏళ్లుగా హిజాబ్ ధ‌రిస్తున్నామ‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కూ లేని అభ్యంత‌రం ఇప్పుడే ఎందుకు అని ప్ర‌శ్నిస్తున్నారు. 

ఈ విషయం ముస్లిం మత పెద్దలతో పాటు తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు ఆపుతున్నారని తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్‌తో చ‌ర్చించారు. విష‌యం అక్క‌డితో క్లోజ్ అయితే ఓకే.. లేదంటే.. అది ఎవ‌రికీ మంచిది కాదు.