TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరసనకు దిగిన టీడీపీ.. ఉద్రిక్తత

Published on: Fri Jan 8, 2021 10:29AM

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో తాజాగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గౌతు లచ్చన్నపై రాష్ట్ర మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద టీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు భారీగా విగ్రహం వద్దకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు.


ఈ నిరసనలో పాల్హోనేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, సీనియర్ నేతలు లచ్చన్న విగ్రహం వద్దకు చేరుకున్నారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసి, ఆ తరువాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, బీసీల నాయకుడుగా గౌతు లచ్చన్నకు ఇటు రాష్ట్రంలోనూ అటు దేశంలో కూడా మంచి పేరుంది. అలాంటి నాయకుడిపై మంత్రి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పని, ఆ మంత్రిని బర్త్ రఫ్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు .