నలుగురు స‌భ్యుల‌తో హైలెవ‌ల్ క‌మిటీ

 

ఎట్టకేల‌కు సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌పై కాంగ్రెస్ హైక‌మాండ్ స్పందించింది. ఆంద్రప్రదేశ్ విభ‌జ‌న‌పై న‌లుగురు స‌భ్యుల‌తో హైలెవ‌ల్ క‌మిటీని ప్రక‌టించింది అధిష్టానం. ఈ సారి క‌మిటీలో కూడా రాష్ట్రానికి సంభందించిన ఎవ‌రికీ స్థానం క‌ల్పించ‌కుండా కాంగ్రెస్ త‌న మార్క్ చూపించింది.

బుధవారం ప్రక‌టించిన క‌మిటీలో ఎకె ఆంటనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లు ఉన్నారు. న‌లుగురు స‌భ్యులున్న ఈ క‌మిటీకి ఆంటోని నేతృత్వం వ‌హిస్తారు. వీరు ముందుగా సీమాంద్రుల అభిప్రాయాల‌ను విని వాటిపై పూర్తి స్ధాయి నివేదిక సిద్దం చేయ‌నున్నారు.

ముఖ్యంగా ఈ క‌మిటీ సీడ‌బ్ల్యూసి స‌మావేశం త‌రువాత రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఆరాతీయ‌నుంది. ఈ మేరుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జ‌నార్ధన్ ద్వివేది ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ఈ క‌మిటీ కేవ‌లం సీమాంద్రుల అభ్యంతరాలు విన‌డానికా లేక రాష్ట్ర విభ‌జ‌న ప్రక్రియ‌లో భాగంలో క‌మిటీని వేశారా అన్న విష‌యం మాత్రం చెప్పలేదు.