కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!

 

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించొద్దని ఆదేశించింది. కొత్త అసెంబ్లీ భవనం కోసం ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చకూడదని హైకోర్టు స్పష్టంచేసింది. 

ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించడానికి తెెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ భవన నిర్మాణానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. 

అయితే అసెంబ్లీ కోసం.. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేత నిర్ణయంపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోర్టుకెక్కారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్ని కూల్చడం ఎంత వరకు సమంజసమని వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని నిర్మించొద్దని ఆదేశించింది.