పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు
Published on: Wed Aug 14, 2024 2:22PM
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన కేసు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంప ముంచేలా వుంది. ఈ కేసులో పెద్దిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దేశంలో అత్యంత వేగంగా విచారణ జరుగుతున్న ఎన్నికల నేరాల కేసులలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు ఒకటిగా నిలుస్తోంది. "ఎన్నికల అఫిడవిట్‌లో పలు ఆస్తుల వివరాలు వెల్లడించలేదు" అనే కేసులో పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పెద్దిరెడ్డి తప్పుడు అఫిడవిట్‌కి సంబంధించి అన్ని ఆధారాలతో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పకడ్బందీగా పిటిషన్ వేశారు. ఈ కేసు నుంచి పెద్దిరెడ్డి తప్పించుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన శాసనసభ సభ్యత్వం కూడా రద్దయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.


