TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆషు రెడ్డి పరువు నష్టం కేసు.. మీడియా కథనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

Published on: Fri May 1, 2026 1:12PM

సోషల్ మీడియా, టీవీ ఛానెల్స్‌లో తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై చర్యలు తీసుకోవాలని సినీ నటి అషు రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదట ఈ వ్యవహారంపై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన ఆమె పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మే 6కు వాయిదా వేసింది.  అనంతరం మధ్యంతర ఆర్డర్ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు.  విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు,  సివిల్ కోర్టులో మెరిట్స్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం  చేసింది.

ఈ నేపథ్యంలో  ఆశు రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంపై టెలివిజన్ ఛానెల్స్, న్యూస్ వెబ్‌సైట్లు, యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  చాలా వరకు ధృవీకరించని సమాచారంతో జరుగుతున్న ప్రచారం  తనను తీవ్రంగా బాధించిందన్నారు.  ఈ అంశాన్ని నిర్ణయించాల్సిన సరైన వేదిక కోర్టులేనని.. మీడియా ట్రయల్ కాదనీ పేర్కొన్న ఆషురెడ్డి.. హైకోర్టు  ఉత్తర్వు ప్రకారం  ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు పోస్టులు తొలగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే తన న్యాయవాదులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.