అసెంబ్లీ రద్దుపై పిటిషన్‌.. కొట్టేసిన హైకోర్టు

 

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసీఆర్ 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ.. న్యాయవాది రాపోలు భాస్కర్ గత శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించినట్లు కనిపించడంలేదని తెలిపింది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగనప్పుడు తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.