హైకోర్టులో ఎంఎస్‌వోలకు ఊరట.. సెట్‌టాప్ బాక్సులపై రెండు నెలలు గడువు
Published on: Wed Dec 30, 2015 11:08AM

హైకోర్టులో ఎంఎస్‌వోలకు ఊరట లభించింది. రేపటితో సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువు ముగుస్తుండటంతో కేంద్రం సరిపడా సెట్‌టాప్ బాక్సులు ఏర్పాటు చేయలేదని.. ఎంఎస్‌వోలు సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువు పెంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఎంఎస్‌వోలు సెట్‌టాప్ బాక్సుల కొరత ఉన్నందున గడువు పొడిగించాలని.. 85 శాతం మందికి సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేవని తమ వాదనను వినిపించారు. దీంతో కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు గాను సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటుకు గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.


