TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభం

Published on: Thu Oct 9, 2025 2:54PM

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ పునఃప్రారంభమైంది. నిన్న జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ పిటిషనర్ల వాదనలు విని కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టుకు మంత్రి వాకిటి శ్రీహరి  హాజరైరు.  బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిన్న వాదనలు సాగాయి. 

ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.ఈ సందర్భంగా సీజే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకే ఉందని, ఈ విషయమై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే డిస్మిస్‌ చేసిందని అడ్వకేట్‌ జనరల్‌ గుర్తు చేశారు.ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌లు సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే.