హైకోర్టులో నరేంద్ర మోడీకి చుక్కెదురు
Published on: Wed Jan 18, 2012 4:11PM
అ
హ్మదాబాద్ : లోకాయుక్త నియామకం విషయంలో గుజరాత్ సీఎం నరేంద్రమోడికి ఆ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. మాజీ న్యాయమూర్తి ఆర్‌ఏ మోహతాను రాష్ట్ర లోకాయుక్తగా నియమించడాన్ని హైకోర్టు సమర్థించింది. లోకాయుక్త నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. మెహతాను లోకాయుక్తగా నియమిస్తూ గవర్నర్ బెనీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2011 ఆగస్టు 27 మోడీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సీఎం రాష్ట్ర క్యాబినెట్‌ను సంప్రదించకుండా గవర్నర్ లోకాయుక్తను నియమించారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ఆరోపిస్తున్నాయి.


